డబ్బు, పేరు, కీర్తి అన్నందుకు నవ్వొస్తోంది.. రజినీకాంత్ సూపర్ వర్డ్స్

Saturday, October 28th, 2017, 04:28:57 PM IST

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యంత ఆదరణ పొందిన నటులలో రజినీకాంత్ కూడా ఒకరు. కెరీర్ లో ఎన్నో భారీ విజయాలని అందుకున్నా కూడా రజినీకాంత్ ఎప్పుడు తన హోదా ఈ స్థాయిలో ఉందని చెప్పుకోలేదు. ఎంత విజయాన్ని అందుకున్నా కూడా ఒకటే లెవల్ లో ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక ప్రస్తుతం తెలుగు, తమిళ్ అనే కాకుండా అన్ని బాషల వారు అత్యంత ఆసక్తిగా రజినీకాంత్ నటించిన 2.0 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. నిన్న ఆడియో వేడుకను కూడా దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రజినీకాంత్ కొన్ని మంచి మాటలని చెప్పారు. కెరీర్ మొదట్లో ఎవరికైనా సరే డబ్బు, పేరు, కీర్తి అనే మూడు విషయాల గురించి చాలా ఆలోచిస్తారని, అంతే కాకుండా అవే సంతోషమని అందరు అనుకుంటారు. కానీ జీవితంలో ఒక దశ దాటినా తర్వాత అవి ఏ మాత్రం ఆనందాన్ని ఇవ్వవని రజనీ తెలిపారు.

మొదట వాటి గురించి ఆలోచించిన విధానం గురించి ఇప్పుడు ఆలోచిస్తే చాలా నవ్వొస్తోందని చెప్పారు. తాను ప్రేక్షకుల ఆశీస్సుల వల్ల అలాగే దేవుడి దయ వల్ల ఇంతవరకు వచ్చాను. ఇక చిత్ర పరిశ్రమలో తన జీవితం తొందరగా గడిచిపోయింది అన్నట్లు అనిపిస్తోందని చెప్పిన రజినీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నాలుగైదేళ్లయినట్టే ఉందని అన్నారు. ఇక 2.0 సినిమా అందరికి నచ్చుతుందని చెబుతూ.. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా చేయకూడదని చెప్పారు.

  •  
  •  
  •  
  •  

Comments