స్పైడర్ పై రజినీ కాంత్ షాకింగ్ కామెంట్స్

Thursday, September 28th, 2017, 06:15:00 PM IST


మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన స్పైడర్ సినిమా బుధవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రముఖులు వీక్షించి ఎవరి స్టైల్ లో వారు పొగుడుతున్నారు. ఇక మహేష్ అభిమానులకు ఈ సినిమా మంచి కిక్ ని ఇచ్చిందని అంటున్నారు. అయితే ఈ సినిమా తమిళ్ లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది.

మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కడంతో అక్కడ కూడా చాలా మంది సినీ ప్రముఖులు సినిమాను చూశారు. రీసెంట్ గా రజినీకాంత్ కూడా స్పెషల్ షో వేసుకొని మరి స్పైడర్ సినిమాను చూసి తన అభిప్రాయాన్ని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. యాక్షన్ తో పాటు మంచి సందేశం ఉన్న చిత్రం. దర్శకుడు మురగదాస్ సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. అలాగే మహేష్ నటన కూడా చాలా బావుంది. సినిమా తనకు చాలా బాగా నచ్చిందని రజిని చెబుతూ.. స్పైడర్ లాంటి మంచి సినిమాని ప్రేక్షకులకు అందించినందుకు చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments