రజని స్టైలే వేరనంటున్న అక్షయ్ కుమార్ !

Saturday, January 20th, 2018, 02:27:20 PM IST

సూపర్ స్టార్ రజినికాంత్ కి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానులు వున్నారు. అంతేకాక భారతీయ చలన చిత్ర పరిశ్రమ లో ప్రముఖ నటీనటులలో కూడా ఆయనకి చాలామందే ఫాన్స్ వున్నారు. అందులో ఒకరు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ఆయన ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా చేస్తున్న రోబో 2.0 లో ప్రతినాయకుడిగా ‘క్రోమాన్’ పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఆయన ఒక ఆంధ్ర పత్రికతో మాట్లాడుతూ ఈ చిత్రం లో విలన్ పాత్ర ఎందుకు నటిస్తున్నారు అని అడుగగా, ఏం ఎందుకు చేయకూడదు, విలన్ పాత్ర స్ట్రాంగ్ గా ఉంటేనే కదా చిత్రం లో హీరో ఎలివేట్ అయ్యేది అని చెప్పారు. అంతే కాక ఇంత గొప్ప భారీ బడ్జట్ చిత్రమ్ లో నటించడం తన అదృష్టమని, ఇటువంటి చిత్రంలో నటిస్తానని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. అసలు విషయానికి వస్తే ఒకరోజు షూటింగ్ లో యూనిట్ సభ్యులు అందరూ తదుపరి షాట్ కోసం ఎదురు చూస్తూ ఉండగా, ఆ సమయంలో రజని తన ప్యాంటుకు వున్న దుమ్మును దులుపుకుంటూ కనిపించారని, రజని ఎంత స్టైల్ గా ఆ పనిచేస్తున్నారంటే, మొత్తం యూనిట్ ఆయన్నే చూస్తూ వున్నాం. నిజంగా ఆయన ఏపని చేసినా ఒక స్టైల్ గా చేస్తారని, ఒకవేళ ఆయన నన్ను కొట్టినా దాన్ని నేను ఎంజాయ్ చేస్తాను అన్నారు. దాదాపు 450 కోట్ల బడ్జెట్తో రూపొందతున్న 2.0 చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో విడుదలకానున్నట్లు తెలుస్తోంది…