రజిని సినిమాల్లో మాత్రమే సూపర్ స్టార్ : హ్యూమా ఖురేషి

Friday, June 1st, 2018, 01:12:26 PM IST

సూపర్ స్టార్ రజినికాంత్ గురించి తెలియని దక్షిణాది వారుండరు. నిజానికి ఉత్తరాదిన, అలానే విదేశాల్లో కూడా కూడా రజినికాంత్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన మరొకసారి కబాలి చిత్ర దర్శకుడు పారంజిత్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం కాలా. ఇందలో రజిని మరొక్కమారు గ్యాంగ్ స్టార్ గా కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో ఆయనకు భార్యగా ఈశ్వరి రావు నటించగా, ఆయనకు ప్రియురాలిగా హ్యూమా ఖురేషి నటిస్తుంది. కాగా ఇటీవల హ్యూమా ఒక ఇంటర్వ్యూ లో హీరో రజినీకాంత్ గురించి మాట్లాడుతూ, రజిని సర్ తో మొదట సినిమా అవకాశం రాగానే చాలా భయపడ్డాను,

అంత పెద్ద సూపర్ స్టార్ తో సినిమా చేయడమంటే సెట్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి వుంటుందని మొదట కొంత కంగారుపడ్డాను అన్నారు. ఇక సినిమా షూటింగ్ మొదలయ్యాక రజిని సర్ ని చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది, కోట్ల మంది అభిమానులు, ఎంతో సంపద, పేరుప్రఖ్యాతలు వున్న ఆయన సెట్లోకి వచ్చాక లైట్ బాయ్ దగ్గరనుండి దర్శకుని వరుకు ప్రతిఒక్కరితో తన స్టార్డమ్ ని పక్కనపెట్టి కలిసిపోతారన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడితే చాలు మన మనసులో వున్న భయాలన్నీ తొలగిపోతాయని ఆమె అన్నారు. ఈ చిత్రంలో తాను జరీనా అనే పాత్రలో నటిస్తున్నాని, నా పాత్ర అందరిని తప్పక అలరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా కాలా చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల 7న విడుదల కానుంది….

  •  
  •  
  •  
  •  

Comments