2.ఓ లో స్పెషల్ గెస్ట్ ?

Thursday, April 5th, 2018, 12:16:33 PM IST

ఇండియాలోనే అత్యధిక భారీ బ్యాడ్జెట్ తో తెరకెక్కిన 2.ఓ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రతి ఒక్క భారతీయడు ఎదురుచూస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ సినిమాలో రజినీకాంత్ అమీ జాక్సన్ అలాగే అక్షయ్ కుమార్ నటించిన సంగతి తెలిసిందే. అయితే 2.ఓ లో మరొక ముఖ్య పాత్రలో మాజీ ప్రపంచ సుందరి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. రోబోకు ఒక హృదయం ఉందని నిరూపించి ఆ రోబోని పూర్తిగా మారిపోయేలా చేసిన అందాల నటి ఎవరొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రోబో సినిమాలో చిట్టి మనసును గెలుచుకున్న ఐశ్వర్యా రాయ్ 2.ఓ లో కూడా కనిపించనుందని టాక్ వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని శంకర్ ఎప్పుడో ఆమెకు సంబందించిన షూటింగ్ ని సీక్రెట్ గా పూర్తి చేశాడని సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments