పవర్ అంటే నాకిష్టం అంటూ కొత్త నిర్వచనం చెప్పిన రజినీ..!

Sunday, February 5th, 2017, 01:17:25 PM IST


సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా ? వస్తే ఎప్పుడు..? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం రజిని అభిమానులతో పాటు రాజకీయ వేత్తలు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భగా ఆయన అధికారం పై తాజాగా ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. పవర్ అంటే తనకు ఇష్టమని అన్నారు. పరమహంస యోగానంద రచించిన ‘ది డివైన్ రొమాన్స్ ‘ పుస్తక తమిళ అనువాదం ‘దైవిక కాదల్’ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం చెన్నై లో జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న రజినీకాంత్ ఈ వ్యాఖ్యలు చేసారు. తనకు పవర్ అంటే ఇష్టమని కానీ అది అందరూ అనుకుంటున్న పవర్ కాదని రజిని అన్నారు.

తనకు ఇష్టమైన పవర్ ఆధ్యాత్మికత కు సంబంధించినదని అన్నారు. తనకు నటుడిగా చెప్పుకోవడం కంటే ఆధ్యాత్మిక వేత్తగా చెప్పుకోవడమే ఇష్టమని రజిని అన్నారు. తనకు డబ్బు కావాలా, పేరుకావాలా.. ఆధ్యాత్మికత కావాలా ? అని అడిగితే ఆధ్యాత్మికతనే కోరుకుంటానని అన్నారు.మన ఇంటికి అతిథి వస్తున్నాడంటేనే ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతాం.. అలాంటిది దైవం మన మనసులోకి రావాలంటే ఇంకెంతో శుభ్రంగా ఉండాలని అన్నారు.