ర‌జ‌నీ మాత్ర‌మే అస‌లైన నాయ‌కుడు!

Friday, June 1st, 2018, 06:10:01 PM IST

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌కంప‌నాలు షురూ అయిన‌ట్టే. అత‌డు అంద‌రివాడు. ఎవ‌రిని అయినా మెప్పించే మ‌రిపించే ఛ‌రిష్మా ఉన్న‌వాడు. అంతేకాదు.. ఒక నాయ‌కుడికి ఉండాల్సిన అరుదైన ల‌క్ష‌ణం అత‌డికి ఉంద‌నేది విశ్లేష‌కులు చెబుతున్న మాట‌. అత‌డు అవ‌స‌రం అనుకుంటే అవ‌త‌లి వారి ముందు త‌గ్గి .. క్ష‌మాప‌ణ‌లు చెబుతాడు.

నిన్న తూతుకుడి స్టెరిలైట్ వివాదం వేళ సీరియ‌స్ అయిన ర‌జ‌నీ ఉన్న‌ట్టుండి ఆ ఘ‌ట‌న త‌ర‌వాత జ‌ర్న‌లిస్టుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన వైనం చూస్తుంటే అది అత‌డికి మాత్ర‌మే సాధ్యం అని అనిపించ‌క‌మాన‌దు. ఎవ‌రినీ ఉద్ధేశ‌పూర్వ‌కంగా తిట్ట‌లేదు. త‌మిళ‌నాడు శ్మ‌శానంగా మారుతుంద‌న్న ఆవేద‌న‌లోనే విమానాశ్ర‌యంలో అలా సీరియ‌స్ అవ్వాల్సొచ్చింద‌ని ర‌జ‌నీ వివ‌ర‌ణ ఇచ్చారు. ఒక మ‌హానాయ‌కుడు కాబోయే వాడికి ఉండాల్సిన మొట్టమొద‌టి ల‌క్ష‌ణం చేసిన త‌ప్పును అంగీక‌రించి క్ష‌మాప‌ణ కోర‌డం. అది దేశంలోనే ఒకే ఒక్క‌డికి ఉంది. అది ర‌జ‌నీకాంత్‌కి మాత్ర‌మే. ర‌జ‌నీ అంత‌టి స్థాయి ఉన్న ఏ వ్య‌క్తి చేయ‌లేని ప‌ని సారీ చెప్ప‌డం. త‌లొగ్గ‌డం.. జ‌నం ముందు ఒదిగి మాట్లాడ‌డం. అది అత‌డు చేస్తున్నాడు కాబ‌ట్టి త‌ప్ప‌క వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం అత‌డిని వ‌రిస్తుంద‌ని జోస్యం చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments