ఒకే ఒక్క చిరంజీవి- ర‌జ‌నీకాంత్‌

Monday, June 4th, 2018, 11:06:56 PM IST

సౌత్‌లో సూప‌ర్‌స్టార్ ఒక్క‌రే.. ఒకే ఒక్క ర‌జ‌నీకాంత్‌! అంటూ అల్లుడు ధ‌నుష్ ఓ రేంజులో పొగిడేశారు. నేటి సాయంత్రం హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్‌లో జ‌రిగిన కాలా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో మామ ర‌జ‌నీని అల్లుళ్లు ధ‌నుష్ ఓ రేంజులో పొగిడేశాడు. ర‌జ‌నీకాంత్ ఒక్క‌రు మాత్ర‌మే. ఇంకెవ‌రూ అలా ఉండ‌రు.. అని పొగిడేశారు.

అయితే ఈ పొగడ్త‌కు ర‌జ‌నీ ఇచ్చిన స‌మాధానం అంతే పెద్ద షాకిచ్చింది. ఒకే ఒక్క ర‌జ‌నీకాంత్ అని ధ‌నుష్ అన్నారు. ఒకే చిరంజీవి, ఒకే నాగార్జున‌, ఒకే వెంక‌టేష్ … వీళ్లు కూడా ఒకే ఒక్క‌రు క‌దా!“ అని అన్నారు. ఎంచుకున్న ఏ రంగంలో అయినా అందివ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని ఎద‌గాల‌ని రజ‌నీకాంత్ సూచించారు. త‌న‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా త‌మిళుల్లానే సొంత మ‌నిషిగా అభిమానించార‌ని, 1978లో అంతు లేని క‌థ చిత్రంతో తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించాన‌ని ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీ గుర్తు చేసుకున్నారు. తెలుగులో ఎన్నో సినిమాలు త‌న‌కు బ్రేక్‌నిచ్చాయ‌ని అన్నారు. పెద్దాయ‌న‌ ఎన్టీఆర్ ఆశీర్వాదం తీసుకునేవాడిని. దాస‌రి నారాయ‌ణ‌రావు గారు సొంత బిడ్డ‌లా చూసుకునేవారు. నేడు వాళ్లెవ‌రూ లేర‌ని ర‌జ‌నీ జ్ఞాప‌కాల్లోకి వెళ్లారు. సూప‌ర్‌స్టార్‌లోని ఈ గొప్ప ల‌క్ష‌ణ‌మే అత‌డిని అంత‌టి వాడిని చేసింది. అయితే ఇది ఎంద‌రిలో ఉంది? అంటే చెప్ప‌డం క‌ష్ట‌మే.

  •  
  •  
  •  
  •  

Comments