ఇక చాలు.. నాన్న సినిమాలు తగ్గిస్తే బావుంటుంది: రజినీకాంత్ కూతురు

Tuesday, June 12th, 2018, 03:45:35 PM IST

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎదురులేని కథానాయకుడిగా ఎంతో మందికి ఆదర్సప్రాయంగా నిలిచిన నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన వస్తున్నారు అంటేనే అభిమానులు ఎగబడిపోతారు. రజినీకాంత్ స్టార్ స్టామినా గురించి ఎంత పొగిడినా తక్కువే. అభిమానులపై ఆయన చూపే ప్రేమ అంతా ఇంతా కాదు. ఇకపోతే ఆయన నిరంతరం సినిమా ప్రపంచంలో ఉండటంపై రజినీకాంత్ గారాల కూతురు ఐశ్వర్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

నాన్న ఇక నుంచి సినిమాలు మానేసి ఫ్యామిలీతో ఎక్కువ సమయం కేటాయించాలని ఐశ్వర్య తన అభిప్రాయాన్ని తెలిపింది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇంకా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగితోంది. అయితే సడన్ గా ఇప్పుడే ఆయన్ను సినిమాలను ఆపేయమని నేను చెప్పడం లేదు. ఈ వయసులో కొంత కుటుంబానికి కూడా సమయాన్ని కేటాయించి సినిమాలను కూడా కవర్ చేస్తే బావుంటుందని మాత్రమే చెబుతున్నానని ఐశ్వర్య వివరించారు.