అభిమాని సెల్ఫీ కోరిక తీర్చిన రజినీకాంత్!

Thursday, May 31st, 2018, 04:57:40 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు చెపితే చాలు ఆయన అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. సాక్ష్యాత్తు బాలీవుడ్ బడా స్టార్లు కూడా రజినికాంత్ క్రేజ్ కి ఫాలోయింగ్ కి ఫిదా అయిన సందర్భాలు చాలానే వున్నాయి. ముఖ్యంగా రజినీకాంత్ మిగతా హీరోలకంటే జీవనసరళిలో కొంచెం భిన్నం అని చెప్పాలి. ఆయన సినిమాల్లో నటించేటప్పుడు, అలానే బయట కూడా చాలా నార్మల్ జీవితాన్ని గడుపుతుంటారని ఆయన సన్నిహితులు చెపుతుంటారు. హంగులు ఆర్భాటాలకు ఎప్పుడు దూరంగా వుండే రజిని తన ఎదుగుదలకు కారణమైన ప్రతి అభిమాని తనకు ప్రాణంతో సమానమని చెపుతుంటారు. అయితే నిన్న ఉదయం రజిని ఇంటివద్ద ఒకరు అరుదైన సంఘటన చోటుచేసుకుంది. తన అభిమాన తలైవా తో ఒక ఫోటో దిగలనుకున్నాడు లక్ష్మణ్ అనే యువకుడు.

అంతే వెంటనే తలైవా ఇంటికి చేరుకున్నాడు. అదే సమయంలో ఆయన చెన్నై ఎయిర్పోర్ట్ కు బయలుదేరడంతో కారు వెంబడి ఎయిర్పోర్ట్ వరకు వచ్చిన లక్ష్మణ్ ను గమనించిన రజిని కార్ ఆపి లక్ష్మణ్ ని పిలిచారు. వెనువెంటనే కార్ వద్దకు వచ్చిన లక్ష్మణ్ తలైవా మీతో ఒక్క సెల్ఫీ కావాలి అనగానే, తప్పకుండ ఇస్తాను కన్నా అని లక్ష్మణ్ తో సెల్ఫీ దిగారు. కాగా లక్ష్మణ్ తలైవతో దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇది చాలు నా జన్మకి, ఇక మరణించినా ఇబ్బందిలేదంటూ పోస్ట్ చేసిన ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది……