ద‌ళ‌ప‌తి రికార్డులు బ్రేక్ చేసిన ఇల‌య‌ద‌ళ‌ప‌తి!!

Wednesday, October 25th, 2017, 05:07:04 PM IST

త‌మిళ సినీప‌రిశ్ర‌మ‌లో రికార్డుల మోత మోగుతోంది. యువ‌సంచ‌ల‌నం ఇల‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ ఈ సంచ‌ల‌నాల‌కు కేంద్ర‌బిందువు అవుతున్నాడు. ఇప్ప‌టికే అత‌డు న‌టించిన మెర్స‌ల్ వివాదాల‌తో మోతెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాంట్ర‌వ‌ర్శీ తెచ్చిన క్రేజుతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అసాధార‌ణ వ‌సూళ్లు సాధిస్తూ రికార్డుల‌కెక్కుతోంది. మెర్స‌ల్ 7రోజుల్లో 170 కోట్ల వ‌సూళ్ల‌తో మోతెక్కించింది.

విజ‌య్ పేరిట ఉన్న `తేరి` రికార్డును తిర‌గ‌రాయ‌డ‌మే గాకుండా, అంతేకాదు ఇన్నాళ్లు ర‌జ‌నీకాంత్ పేరిట ఉన్న తొలివారం వ‌సూళ్ల రికార్డును విజ‌య్ సినిమా `మెర్స‌ల్‌` బ్రేక్ చేసింద‌ని తెలుస్తోంది. అంతేకాదు మెర్స‌ల్ కేవ‌లం త‌మిళ‌నాడులో 90 కోట్ల మేర వ‌సూలు చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్త వ‌సూళ్లు క‌లుపుకుని 170 కోట్ల మేర గ్రాస్ వ‌సూలు చేసింద‌ని తెలుస్తోంది. విజయ్ కెరీర్ బెస్ట్ మూవీ `తెరి` సాధించిన రూ.143.6 కోట్లు వసూళ్ల‌ను అధిగ‌మించి.. 200 కోట్ల క్ల‌బ్ వైపు దూసుకుపోవ‌డం హాట్ టాపిక్ అయ్యింది. ఆస‌క్తిక‌రంగా తేరి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ని ఇచ్చిన అట్లీ మెర్స‌ల్‌తో ఇల‌య‌ద‌ళ‌ప‌తికి మ‌రో గ్రేట్ మూవీని ఇచ్చాడ‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ద‌ళ‌ప‌తి ర‌జ‌నీకాంత్ రికార్డుల్ని బ్రేక్ చేసిన న‌వ‌త‌రం హీరోగా విజ‌య్ పేరు త‌మిళ‌నాడులో మార్మోగిపోతోంది. ఇక ఈ క్రేజీ హీరో మునుముందు ఇంకెలాంటి సంచ‌ల‌నాల‌కు తెర‌తీస్తాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments