ర‌జ‌నీ- విజ‌య్ సేతుప‌తి మ‌ల్టీస్టార‌ర్‌

Thursday, April 26th, 2018, 10:42:21 PM IST

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఎంద‌రో స‌మ‌కాలీన న‌టుల‌తో క‌లిసి ప‌ని చేశారు. గొప్ప సినిమాల్లో న‌టించారు. చిరంజీవి, మోహ‌న్‌బాబు, క‌మ‌ల్‌హాస‌న్, మ‌మ్ముట్టి వంటి స్టార్లంతా ర‌జ‌నీతో క‌లిసి న‌టించారు. న‌వ‌త‌రం న‌టుల‌తోనూ ర‌జ‌నీ కాంబినేష‌న్ బంప‌ర్ హిట్‌. యువ‌ న‌టుల్లోనూ అబ్బాస్‌, జ‌గ‌ప‌తిబాబు వంటి స్టార్లు ర‌జ‌నీ సినిమాల్లో న‌టించారు.

ఇప్పుడున్న త‌రంలో మేటి క‌థానాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న విజ‌య్ సేతుప‌తికి అలాంటి అరుదైన అవ‌కాశం ద‌క్కింది. ర‌జ‌నీకాంత్ – విజ‌య్ సేతుప‌తి కాంబినేష‌న్‌లో స‌న్ పిక్చ‌ర్స్ ఓ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాన్ని నిర్మించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. కీర్తీక్ సుబ్బ‌రాజు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ విష‌యాన్ని స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ ఎంతో ఆనందంగా ట్విట్ట‌ర్‌లో షేర్ చేసుకుంది. ఇటీవ‌లే మాధ‌వ‌న్‌తో క‌లిసి విజ‌య్ సేతుప‌తి న‌టించిన `విక్ర‌మవేద‌` సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీతో కాంబినేష‌న్ రేర్ ఫీట్‌. మ‌రోవైపు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `సైరా-న‌ర‌సింహారెడ్డి`లోనూ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మొత్తానికి చిరంజీవి, ర‌జ‌నీకాంత్ వంటి సీనియ‌ర్ క‌థానాయ‌కుల‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం విజ‌య్‌ సేతుప‌తి అందుకోవ‌డం ఫ్యాన్స్‌ని ఎగ్జ‌యిట్ చేస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments