వీడియో : ముంబై విమానాశ్ర‌యంలో ర‌జ‌నీ అలా చిక్కారు !

Tuesday, February 27th, 2018, 06:31:36 PM IST

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి అంద‌రాని అనంత లోకాల‌కు వెళ్లిపోయారు. శ్రీ‌దేవి మ‌ర‌ణానంత‌రం దేశ‌వ్యాప్తంగా ఎంతో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఈ మ‌ర‌ణం స‌హ‌జ‌మ‌ర‌ణ‌మా? లేక ప్ర‌మాద‌వ‌శాత్తూ జ‌రిగిన‌దా? అనుమానాస్ప‌ద‌మా? అంటూ ఒక‌టే వాడి వేడి చ‌ర్చ సాగింది. శ్రీ‌దేవి మ‌ర‌ణానంత‌రం టీవీ చానెళ్లలో దీనిపై పెద్ద ఎత్తున డిబేట్ న‌డిచింది. ఎట్ట‌కేల‌కు దుబాయ్ పోలీస్ నుంచి క్లియ‌రెన్స్ రావ‌డంతో పార్థీవ‌దేహాన్ని ముంబైకి చేరుస్తున్నారు.

అయితే శ్రీ‌దేవిని క‌డ‌సారి సంద‌ర్శించేందుకు అభిమాన లోకం ముంబై త‌ర‌లివెళ్లింది. గ‌త మూడు రోజులుగా ప‌డిగాపులు ప‌డుతున్న అభిమానులు ఉన్నారు. ఇక సెల‌బ్రిటీ లోకం యావ‌త్తూ శ్రీ‌దేవి ఇంటికి, అనీల్ క‌పూర్ ఇంటికి చేరుకుంది. నిన్న‌నే విక్ట‌రీ వెంక‌టేష్ సైతం అనీల్ క‌పూర్ ఇంటికి వెళ్లారు. బాలీవుడ్ సీనియ‌ర్ క‌థానాయిక‌ల్లో హేమ‌మాలిని, జ‌య‌ప్ర‌ద వంటివారు శ్రీ‌దేవి స్వ‌గృహానికి వెళ్లారు. పెరుగుతున్న ఒత్తిడితో శ్రీ‌దేవి ఇంటి ప‌రిస‌రాల్లో భారీగా భ‌ద్ర‌త‌ను పెంచారు పోలీస్‌. లేటెస్టుగా నేటి మ‌ధ్యాహ్నం సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ముంబై వెళ్లారు. ముంబై విమానాశ్ర‌యంలో దిగిన ర‌జ‌నీకాంత్ వీడియోలు ప్ర‌స్తుతం ఆన్లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి. సూప‌ర్‌స్టార్ ఎంతో సామాన్యుడిలా చాలా సింపుల్‌గా ముంబై విమానాశ్ర‌యం నుంచి వెళుతూ క‌నిపించారు. మేటి క‌థానాయిక‌ శ్రీ‌దేవితో క‌లిసి ర‌జ‌నీకాంత్ ప‌లు క్లాసిక్స్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌దేవి మ‌ర‌ణం దేశ‌సినీప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు అని ర‌జ‌నీ సంతాపం తెలియ‌జేశారు.

#rajnikant today the airport

A post shared by Viral Bhayani (@viralbhayani) on