కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి రజినీయే : కమల్ సోదరుడి సంచలన వ్యాఖ్య

Sunday, April 29th, 2018, 06:27:51 PM IST

సూపర్ స్టార్ రజినికాంత్ కి వున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసింది ఏముంటుంది చెప్పండి. మన దేశంలో అతిపెద్దదైన బాలీవుడ్ నటీ నటులు సైతం రజిని క్రేజ్ ముందు పనికిరారనేది ఒప్పుకు తీరవలసిన అంశం. ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ సైతం తాము పేరున్న నటులమని, కానీ రజిని మాత్రం పేరుతో పాటు ఎప్పటికి తరగని క్రేజ్ ఫాలోయింగ్ సంపాదించినా వ్యక్తి అని పొగిడిన సందర్భాలు లేకపోలేవు. అయితే త్వరలో రాజకీయాల్లోకి వస్తున్న అంటూ రజిని ప్రకటన చేయడం మినహా ఆయన దానికి సంబంధించి ఇప్పటివరకు పార్టీ పేరు, గుర్తు ఇతరత్రాలేవి ప్రకటించలేదు. మరో వైపు అయన సమకాలీకుడు కమల్ మాత్రం పార్టీ ప్రకటనతోపాటు అప్పుడే ప్రజల్లోకి వెళ్లి యాత్రలో చేయడం మొదలుపెట్టారు. అయితే నిన్న కమల్ సోదరుడు చారు హాసన్ తమిళ నాడు రాజ్యకీయాలపై ఒక సంచలన వ్యాఖ్య చేశారు.

తన సోదరుడు కమల్ హాసన్ అద్భుత నాయుడేనని, కాకపోతే రజినీకి మాత్రం అంతకు మించిన పేరుందని అన్నాడు. అంతటితో ఆగకుండా ఇప్పటికే జయలలిత మరణంతో ప్రజలకు మంచి భరోసా ఇచ్చే ముఖ్యమంత్రి కోసం తమిళ ప్రజలు ఎదురుచూస్తున్నారని, తనకు తెలిసిన తెలుసుకున్న దాన్ని బట్టి చూస్తే రానున్న ఎన్నికల్లో రజినీకి ముఖ్యమంత్రి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆయన అన్నారు. కాగా చారు హాసన్ ఇప్పుడే కాదు ఇదివరకు కూడా పలుమార్లు రజనీని, రజిని గొప్పతనాన్ని పొగిడేవారని, అయితే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమేనని కమల్ అనుచర వర్గం అంటోంది. అయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ నాట పెద్ద చర్చనీయాంశంగా మారాయి……

  •  
  •  
  •  
  •  

Comments