విడుదల అయ్యిన రజినీకాంత్ 165వ సినిమా మోషన్ పోస్టర్..!

Friday, September 7th, 2018, 06:59:08 PM IST

ఒకటే అనుకుంటే ఈ రోజు రెండు బహుమానాలు రజిని అభిమానులకు సినీ ప్రేమికులకు అందాయి. ఒకటి 2.0 సినిమా యొక్క టీజర్ విడుదల తేదీని ఖరారు చేసినట్టు శంకర్ ప్రకటించారు, ఇంకోటి “కాలా” తర్వాత రజినికాంత్ చెయ్యబోయే 165వ సినిమా యొక్క మోషన్ పోస్టర్ మరియు అఫిషియల్ టైటిల్ విడుదల, ఈ రెండు ఒకే రోజు ప్రకటించేసరికి తలైవా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

అయితే రజినికాంత్ 165వ చిత్రం యొక్క మోషన్ పోస్టర్ ను మరియు టైటిల్ ను చిత్రాన్ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్ వారు చెప్పిన సమయానికే సాయంత్రం 6 గంటలకి విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రానికి తమిళంలో “పెట్టా” అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తుంది. అనిరుద్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దాని మీద ఇంకా వివరాలు వెలువడలేదు.

  •  
  •  
  •  
  •  

Comments