రివ్యూ రాజా తీన్‌మార్ : రాజుగారి గది-2 – నాగార్జున, సమంతలే కాపాడాలి

Saturday, October 14th, 2017, 01:30:46 AM IST

కెప్టెన్ ఆఫ్ ‘రాజుగారి గది-2’ : ఓంకార్

మూల కథ :

స్నేహితులైన అశ్విన్, ప్రవీణ్, కిశోర్ లు ఒక రిసార్ట్ కొని బిజినెస్ స్టార్ట్ చేసి పైకెదగాలని అనుకుంటుంటారు. కానీ ఆలోపే ఆ రిసార్ట్స్ లో ఆత్మ ఉందనే నిజం వాళ్ళకు తెలుస్తుంది. అలా దెయ్యం వలన వాళ్ళు ఆ కష్టం నుండి బయటపడటానికి రుద్ర(నాగార్జున) దగ్గరికి వెళతారు.

కేవలం కళ్ళు చూసి మనసులో ఏముందో చెప్పగల మెంటలిస్ట్ రుద్ర వాళ్ళ కష్టము తీర్చడానికి రిసార్ట్స్ కు వచ్చి తన తన పరిశోధన మొదలుపెడతాడు. ఆ పరిశోధనలో రుద్ర తెలుసుకున్న నిజాలేంటి, అసలు అమృత ఎవరు, ఆమె ఆత్మగా ఎందుకు మారింది, చివరికి రుద్ర ఆ సమస్యను ఎలా సుల్వ్అ చేశాడు అనేదే తెరపై నడిచే కథ.

విజిల్ పోడు :

⤏ సినిమా ఆఖరు 20 నిముషాలు బాగా ఆకట్టుకుంది. అదే సినిమాకు ప్రాణం కూడా. నాగార్జున, సమంతలు ప్రధానంగా నడిచే ఈ సీన్లో ఎమోషన్ బాగ్ వర్కువుట్ అయింది. కాబట్టి మొదటి విజిల్ క్లైమాక్స్ కు వేసుకోవచ్చు.

⤏ ఇక మెంటలిస్టుగా నాగార్జున పాత్ర ఆకట్టుకుంది. కథలోకి ఆ పాత్ర ప్రవేశించినప్పుడే సినిమాకు కొంత బలం చేకూరింది. అందులో నాగ్ నటన కూడా బాగుంది. కాబట్టి ఆయనకు, ఆయన పాత్రకు రెండవ విజిల్ వేసుకోవచ్చు.

⤏ అలాగే సమంత చేసిన అమృత పాత్ర నైపథ్యం, అందులో ఆమె పెర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకున్నాయి. అంతేగాక అందులో ఆమె నటన కూడా బాగుంది. కాబట్టి మూడో విజిల్ సమంతకు, ఆమె పాత్రకు వేయొచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

⤏ సినిమా కథ ఎమోషనల్ గా కొంత కనెక్టైనా కూడా సరైన కథనం లేకపోవడంతో పెద్దగా మెప్పించలేకపోయింది.

⤏ అలాగే ఫస్టాఫ్ మొదటి 40 నిముషాలు టైమ్ పాస్ కోసం నడిపిన రిపీటెడ్ కామెడీ, శీరత్ కపూర్ పాత్ర ఒక దశలో మరీ బోర్ కొట్టేశాయి.

⤏ థ్రిల్లింగ్ అంశాలు ఎలాగూ లేవు కనీసం హర్రర్ కంటెంట్ అయినా ఉందా అంటే అదీ లేదు. దీంతో హర్రర్ సినిమాకు ఉండాల్సిన ప్రధాన లక్షణం ‘రాజుగారి గది -2’ కి లోపించింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

⤏ ఈ సినిమాలో విపరీతంగా అనిపించిన సన్నివేశాలేవీ లేవు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : నాకైతే రాజుగారి గదే బాగుందనిపించింది.
మిస్టర్ బి : అవును. చెప్పినంత స్థాయిలో లేదు.
మిస్టర్ ఏ : మరి సినిమా సంగతేంటి ?
మిస్టర్ బి : చూద్దాం.. నాగార్జున, సమంతలే కాపాడాలి.

  •  
  •  
  •  
  •  

Comments