మార్పు అనేది పార్టీలో కాదు, పవన్ లో వచ్చింది – రాజు రవితేజ

Sunday, December 15th, 2019, 03:58:42 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై, జనసేన పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాజు రవితేజ మరొకసారి కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా ఆయన ఇటీవల జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే. కాగా పార్టీ వీడిన తరువాత రాజు రవితేజ, నేడు మీడియా ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైనటువంటి హాజరయ్యారు. ఈమేరకు మాట్లాడిన ఆయన, పవన్ కళ్యాణ్ పై తీవమైన విమర్శలు చేస్తున్నారు. కాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఇప్పుడు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, నిజానికి పవన్ వ్యవహార శైలి ఏంటో కూడా అర్థం కావడం లేదని రాజు రవితేజ తీవ్రంగా విమర్శించారు.

కాగా జనసేన పార్టీలో మార్పు వచ్చిందని అందరు చర్చించుకుంటున్నారు కానీ నిజానికి మార్పు వచ్చింది పార్టీ లో కాదు పార్టీ అధినేతలో వచ్చిందని వెల్లడించారు. అంతేకాకుండా అసలు పార్టీ పరంగా కులం అనే అంశాన్ని రాజకీయం చేయొద్దని పార్టీ సిద్ధాంతాల్లో ప్రధానంగా ఉంటుంది. కాగా అలాని విషయాన్నీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని రాజు రవితేజ ఆరోపించారు. ఇకపోతే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, ఇదంతా కూడా పవన్ కి తెలిసి కూడా ఈ విషయంలో చొరవ చూపించలేదని ఆరోపించారు.