కన్నడం పై కన్నేసిన రకుల్ ?

Thursday, April 26th, 2018, 11:16:12 AM IST

రకుల్ ప్రీత్ సింగ్ .. టాలీవుడ్ లో ఎంత స్పీడ్ గా స్టార్ హీరోయిన్ గా మారిందో అందరికి తెలుసు. కేవలం నాలుగేళ్లలో స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా మారిన రకుల్ క్రేజ్ ప్రస్తుతం బాగా తగ్గింది. తెలుగులో ఈ అమ్మడికి సరైన అవకాశాలు లేవు. అటు తమిళంలో ఒకటి రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తున్న ఈ భామ ఫోకస్ ఇప్పుడు కన్నడం పై పడింది. అందుకే కన్నడంలో మంచి అవకాశం కోసం ఎదురు చేస్తుంది. తెలుగులో తనకు మళ్ళీ క్రేజ్ రావాలంటే ఇంకాస్త సమయం పట్టేలా ఉండడంతో ఈ లోగా వేరే భాషలో అవకాశాలు అందిపుచ్చుకోవడం బెటర్ అనే ఆలోచనలో పడిందట. ఇప్పటికే పలువురు టాప్ దర్శక నిర్మాతలకు తన ఆసక్తి తెలిపిందని టాక్. సో త్వరలోనే ఈ అమ్మడు కన్నడ సినిమాలో కనిపించే అవకాశం లేకపోలేదు. ఇక తెలుగులోనూ తన ప్రయత్నాలను కంటిన్యూ చేస్తుందని, భారీ సినిమాలో అవకాశం వస్తే తప్ప ఓకే చెప్పదట !!

  •  
  •  
  •  
  •  

Comments