ట్రెoడింగ్ న్యూస్ : కాస్టింగ్ కౌచ్‌ గురించి రకుల్ అబద్దం చెప్పిందా..?

Wednesday, April 11th, 2018, 10:49:51 AM IST

హాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై ఓ ఉద్య‌మం లేవ‌నెత్తిన‌ సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్‌లోను దీనిపై కొంద‌రు తెలుగు అమ్మాయిలు పలు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. మాధ‌వీ ల‌తా, శ్రీ రెడ్డి వంటి వారు త‌మ కెరీర్‌లో జ‌రిగిన విష‌యాల‌ని మీడియా ముందుకి వ‌చ్చి చెబుతున్నారు. ఈ విష‌యం రోజు రోజుకి ముదురుతూ వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌ని కాస్టింగ్ కౌచ్‌పై జాతీయ ప‌త్రిక ప్ర‌శ్నించింది. త‌న జీవితంలో ఇప్ప‌టి వ‌ర‌కు అలాంటివి ఎదురు కాలేద‌ని నిక్క‌చ్చిగా చెప్పింది. నేను నా గురించి మాత్ర‌మే చెబుతున్నాను. ఇత‌రుల గురించి మాట్లాడ‌డం లేదు. వారు ఎన్ని సినిమాలు చేశారో , వారికే తెలియాలి. వాళ్ళ‌పై గౌర‌వంతో మాట్లాడుతున్నాను. నా జీవితంలో ఎప్పుడు కాస్టింగ్ కౌచ్ ఎదురు కాలేదు. అలాంట‌ప్పుడు ఆ విష‌యంపై నేనెలా మాట్లాడ‌గ‌ల‌ను. నేను అబ‌ద్ద‌మే చెబుతున్నాను అనుకుంటే అది వారి ఇష్టం. నేను మాట మీద నిల‌బ‌డుతున్నాను. నన్ను ఎవ‌రు వేధించ‌లేదు అని ర‌కుల్ తెలిపింది. అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించాలే త‌ప్ప త‌ప్పుడు మార్గాల‌ని వెతుక్కోకూడదు అంటూ ఓ స‌ల‌హా కూడా ఇచ్చింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ల‌లో ఒకరిగా ఉన్న ర‌కుల్ ప్ర‌స్తుతం ప‌లు త‌మిళ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.