అవకాశాల్లేవా? ఎవరన్నారు : రూమర్స్ పై రకుల్ క్లారిటీ!

Sunday, September 9th, 2018, 11:52:55 AM IST

ఫ్యాషన్ ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లోకి అడుగుపెట్టిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. చిన్న చిన్న అవకాశాలను అందుకొని మొదట్లో బాగా కష్టపడిన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకు వెళ్లిన రకుల్ బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే అమ్మడికి తెలుగులో ప్లాప్స్ వల్ల అవకాశాలు తగ్గడంతో ఇతర ఇండస్ట్రీపై ఎక్కువగా ద్రుష్టి పెట్టిందని అనేక రూమర్స్ వచ్చాయి.

అయితే ఆ రూమర్స్ పై రకుల్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. స్పైడర్ సినిమా అనంతరం తెలుగులో అవకాశాలు తగ్గడంవల్ల స్లో అయ్యారని వార్తలు వస్తున్నాయనే ప్రశ్నకు రకుల్ మాట్లాడుతూ.. స్లో అయ్యానని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే స్పైడర్ లకి ముందు బిజీగా ఉన్నాను. ఆ సినిమా తరువాత కూడా వేరే సినిమాలకు ఒప్పుకున్నా. ముఖ్యంగా కోలీవుడ్ లో నాలుగైదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. అందుకే టాలీవుడ్ లో మరో సినిమా చేయడం కుదరలేదు.

ఈ సంగతి అందరికి తెలిసినప్పటికీ మీడియా ఎందుకు రకుల్ కి అవకాశాల్లేవ్ అని కథనాలు ప్రచురించిందో?. తెలుగులో ఏడేళ్లలో 15 సినిమాలు చేశా. సక్సెస్ రేట్ సగమే ఉండవచ్చు కానీ ప్రేక్షకులు 75% మార్కులు వేశారు. నా కెరీర్ స్టార్ట్ అయ్యింది ఇక్కడే కాబట్టి టాలీవుడ్ ని వదిలే సమస్యే లేదు. అయినా అవకాశాల్లేవ్ అని ఎవరన్నారు? ప్రస్తుతం బాలీవుడ్ లో అజయ్ దేవగన్ తో తమిళంలో సూర్య ఎన్‌జీకే, కార్తీ 17 తో పాటు శివకార్తీకేయన్‌ తో కూడా నటిస్తున్నా. తెలుగులో వెంకిమామ సినిమాకు సైన్ చేశా. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను అంటూ అమ్మడు తన ప్రాజెక్టుల గురించి వివరిస్తుకు రూమర్స్ చెక్ పెట్టింది.

  •  
  •  
  •  
  •  

Comments