బాలీవుడ్ లో జోరు పెంచిన రకుల్ ?

Saturday, January 27th, 2018, 02:36:33 PM IST

సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కు ఈ మధ్య తెలుగులో కాస్త అవకాశాలు తగ్గాయి. దానికి కారణం ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ వరుసగా పరాజయం పాలవడంతో కొత్త అవకాశాలు తగ్గాయి. దాంతో ఈ అమ్మడు అటు బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేస్తుండడంతో ప్రస్తుతం రకుల్ ఫోకస్ మొత్తం బాలీవుడ్ పై పెట్టింది. హిందీలో ఆయారి పేరుతొ తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రమోషన్ జోరుగా మొదలు పెట్టారు. సో రకుల్ కూడా సినిమా ప్రమోషన్ విషయంలో బిజీగా మారడమే కాకుండా తెలుగులో వస్తున్నా అవకాశాల గురించి కూడా పెద్దగా పట్టించుకోవడం లేదట. అంటే ఈమె ఉద్దేశం బాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని ప్లాన్ వేసినట్టుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ ట్రైలర్ కూడా విడుదల చేసారు .. ఇందులో రకుల్ కూడా యాక్టీవ్ గానే కనిపిస్తుంది. సో త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్న ఈ అమ్మడి కోరికను అయారి నెరవేరుస్తుందో లేదో చూడాలి.