ఎన్టీఆర్ సినిమాలో… రకుల్ ?

Wednesday, July 11th, 2018, 10:14:28 PM IST


మహానటుడు అన్న నందమూరి తారకరామారావు జీవిత కథతో తెలుగులో రూపొందుతున్న బయోపిక్ ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి తో కలిసి బాలయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సినిమాలో పలువురు కీలక నటీనటులు నటిస్తుండడంతో ఈ సినిమాకు భారీ హైప్ నెలకొంది. ఎన్టీఆర్ భార్య పాత్రలో బాలీవుడ్ భామ విద్యా బలం బాలన్ నటిస్తుండగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తాడట. వారితో పాటు మోహన్ బాబు , రానా, కృష్ణ గా సుధీర్ బాబు, అక్కినేని పాత్రలో సుమంత్, ఇలా చాలా లిస్ట్ ఉంది. అయితే ఈ లిస్ట్ లోకి మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఈ సినిమాలో రకుల్ చేసేది ఎవరి పాత్ర అని షాక్ అవుతున్నారా .. ఆమె ఎవరి పాత్రలో నటించడం లేదు .. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందట. ఎన్టీఆర్ సినిమాల్లోని సాంగ్స్ ఎంతలా సూపర్ హిట్ అయ్యాయో అందరికి తెలుసు .. అలాంటి ఓ సూపర్ హిట్ సాంగ్ లో ఈ అమ్మడు మెరవనుందట. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments