ర‌కూల్‌కి రేప్ టెన్ష‌న్స్‌.. భావ‌నకు జ‌రిగిన‌ట్టే త‌న‌కు..!!

Tuesday, February 21st, 2017, 10:20:00 PM IST


మృగాళ్ల అత్యాచారాలు.. లైంగిక వేదింపులు ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్‌. ఏ మ‌లుపు తిరిగినా ఇదొక్క‌టే టాపిక్‌. మొన్న భావ‌నపై లైంగిక వేదింపుల ఘ‌ట‌న త‌ర్వాత లేడీస్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. న‌గ‌రంలో అలాంటి టాప్ సెల‌బ్రిటీల‌కే ర‌క్ష‌ణ లేన‌ప్పుడు మేమెంత అంటూ సాధార‌ణ మ‌హిళ‌లు సైతం అలెర్ట‌యిపోతున్నారు. అయితే ప‌రిశ్ర‌మ‌లో ఇత‌ర‌త్రా నాయిక‌ల్లోనూ ఈ టెన్ష‌న్ రాజుకుంది. త‌మ‌కే ఆ ప‌రిస్థితి వ‌స్తే అంటూ రియ‌లైజ‌వుతున్నారు.

మెగా హీరోయిన్ ర‌కూల్ ప్రీత్‌సింగ్ అయితే మ‌రింత‌గా టెన్ష‌న్స్‌లో ఉన్నాన‌ని చెప్పింది. భావ‌న సంగ‌తి తెలిసాక అమ్మానాన్న‌ల్లో టెన్ష‌న్ పెరిగిపోయింది. ప్ర‌తిక్ష‌ణం అప్ర‌మ‌త్తంగా ఉండ‌మ‌ని చెప్పారు. ఇక‌నుంచి నెల‌కోసారి హైద‌రాబాద్ వ‌చ్చి వెళ‌తామ‌న్నారు. .. అంటూ భ‌యాన్ని వ్య‌క్తం చేసింది. ప్ర‌భుత్వాలు అలాంటి దుర్మార్గుల్ని క్ష‌మించ‌కూడ‌ద‌ని వ్యాఖ్యానించింది. విన్న‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా ర‌కూల్ ఓ ఇంట‌ర్వ్యూలో పైవిధంగా వ్యాఖ్యానించ‌డం విశేషం.