హాట్ టాపిక్‌ : ఏలియ‌న్ స‌ర‌స‌న రకుల్‌ప్రీత్‌?

Sunday, February 18th, 2018, 10:21:49 PM IST


ఇటు సౌత్‌, అటు నార్త్ రెండు చోట్లా వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీగా ఉంది ర‌కుల్ ప్రీత్ సింగ్. ఇటీవ‌లే ర‌కుల్ న‌టించిన `అయ్యారి` రిలీజై చ‌క్క‌ని దేశ‌భ‌క్తి చిత్రం అన్న టాక్ తెచ్చుకుంది. ర‌కుల్ ప్ర‌స్తుతం తెలుగులో ప‌లు క్రేజీ ప్రాజెక్టుల్లో అవ‌కాశాలు అందుకుంటోంది. త‌మిళంలో సూర్య స‌ర‌స‌న ఓ సినిమా, కార్తీ స‌ర‌స‌న ఓ సినిమాలో న‌టిస్తోంది. హిందీలో అజ‌య్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న ఓ సినిమా చేస్తోంది.

తాజాగా త‌మిళ యువ‌క‌థానాయ‌కుడు శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న సీమ రాజా చిత్రంలో న‌టించేందుకు సంత‌కం చేయ‌నుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా ఫాంట‌సీ ఫిక్ష‌న్ సినిమా. ఓ ఏలియ‌న్ చుట్టూ క‌థాంశం ర‌న్ అవుతుంద‌ని తెలుస్తోంది. ఆస్కార్ గ్ర‌హీత ఏ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. క్రేజీగా ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్ క‌థానాయిక‌గా అవ‌కాశం అందుకుంద‌ని చెబుతున్నారు. అయితే ర‌కుల్ ఇంకా ఫైన‌ల్ చేయాల్సి ఉందిట‌. స్పైడ‌ర్ చిత్రంతో వ‌చ్చిన గుర్తింపు ర‌కుల్‌కి వ‌రుస‌గా త‌మిళ ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు తెస్తోంది.