అందుకే రకుల్ తగ్గించేసిందా ?

Wednesday, March 7th, 2018, 01:28:17 PM IST

టాలీవుడ్ లో అటు స్టార్ హీరోలతో .. ఇటు కుర్రహీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ దాదాపు నాలుగేళ్లు ఏమాత్రం గ్యాప్ లేకుండా ఓ రేంజ్ లో అవకాశాలతో దూసుకుపోయింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ మధ్య ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ వరుసగా పరాజయం పాలవడంతో పాపం రకుల్ కు కొత్త అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దానికి తోడు బాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. దాంతో సౌత్ లోనే బెటర్ అని అనుకుందో ఏమో .. అందుకే మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇక తమిళంలో ఇప్పటికే అటు సూర్య, ఇటు కార్తీల సరసన నటిస్తున్న ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో దానికి కారణాలు వెదికే పనిలో పడింది. తనకు అవకాశాలు రాకపోవడానికి కారణాలు ఉన్నాయని తెలుసుకున్న రకుల్ .. వెంటనే వాటిని తగ్గించే పనిలో పడిందట !! అందుకే వెంటనే భారీ రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్న ఈ అమ్మడు తన రెమ్యూనరేషన్ ను బాగా తగ్గించేసిందట. దానికి తోడు .. కాస్త గ్లామర్ విషయంలో కూడా సెలెక్టీవ్ గానే చేయాలనీ ఫిక్స్ అయిందని టాక్. మరి రెమ్యూనరేషన్ తగ్గించడంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు క్యూ కడతాయేమో చూడాలి.