ఫిట్నెస్ తో షాకిస్తున్న .. రామ్ ?

Sunday, February 12th, 2017, 11:03:14 AM IST


ఈ మధ్య తెలుగు యువ హీరోల్లో ఫిట్నెస్ పై ఆసక్తి బాగా పెరిగింది. ఇప్పటికే ధ్రువ సినిమాలో రామ్ చరణ్ కొత్త లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ప్రత్యేకంగా ఫిట్నెస్ ట్రైనర్ ను పెట్టుకుని సూపర్ బాడీ డవలప్ చేసాడు. ఇప్పుడు అదే కోవలో హీరో రామ్ కూడా తన బాడీ తో అదరగొట్టే ప్లాన్ చేస్తున్నాడు. రామ్ పెంచిన కండలు చూసి షాక్ అవుతున్నారు జనాలు. ఇంతకీ రామ్ ఎందుకు ఇంతలా కండలు పెంచాడు అన్నది ఆసక్తి కరంగా మారింది. రామ్ ఇప్పటి వరకు సన్నగా, మాములు కుర్రాడిగా ప్రతి సినిమాలో కనిపించాడు కానీ ఇప్పుడు కండల వీరుడిగా కనిపిస్తూ షాక్ ఇస్తున్నాడు. మరి ఈ లుక్ ఏ సినిమాకోసం అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ .. !! ప్రస్తుతం తన కండల బాడీ పై ఓ ఫోటో సోషల్ మీడియాలో రిలీజ్ చేసాడు. మరి ఆ ఫోటోపై ఓ లుక్ వేయండి.