అల్లు అయాన్ కి డ్రెస్ ఇచ్చింది చరణే!

Monday, March 26th, 2018, 04:40:59 PM IST

మెగా ఫ్యామిలిలో సాధారణంగా ఎవరైనా ఒక సరికొత్త స్టిల్ ఇచ్చారంటే చాలు వైరల్ అవ్వాల్సిందే. మెగా అభిమానులు కూడా అంత ఈజీగా మర్చిపోలేరు. అయితే ప్రస్తుతం మెగా అభిమానులు రంగస్థలం లోని చిట్టిబాబు క్యారెక్టర్ ని ఇష్టపడుతున్నారు. ఎర్ర బనియన్ తో గళ్ల లుంగీ, చెక్స్ షర్ట్ ఇంకా చేతిలో తువ్వాలు.. ఉండడం చూసి అభిమానులు ఎంతో ఇష్టపడ్డారు. ఇక అల్లు వారి అబ్బాయి అయితే ఏకంగా మామ స్టైల్ ని ఫాలో అయ్యాడు. ఆ ఫొటో నెటిజన్స్ ఎంతో ఆకట్టుకుంది. అయితే ఆ డ్రెస్ స్వయంగా రామ్ చరణ్ గిఫ్ట్ గా ఇచ్చారట. అల్లు అర్జున్ ఫోన్ చేసి ని స్టైల్ నే ఫాలో అవ్వడానికి ఇష్టపడుతున్నాడని అందుకే నా షర్ట్ ని లుంగిలా సెట్ చేసి ఇచ్చినట్లు చెప్పాడట. దీంతో చరణ్ తన టేలర్ కి కాల్ చేసి అయాన్ కోసం స్పెషల్ గా కుట్టించమని చెప్పి రెడీ చేసి పంపించాడట. దీంతో అయాన్ ఆ కాస్త్యుమ్ ని తెగ వాడేస్తున్నాడట. ఇక రంగస్థలం సినిమా పనులు మొత్తం పూర్తయ్యాయి. ఈ శుక్రవారం సినిమా రిలీజ్ కాబోతోంది.