ఆమెని చూసి నా భార్య నిద్ర పోలేదంటున్న రామ్ చరణ్..!

Friday, February 2nd, 2018, 10:51:56 AM IST


రాత్రంతా రామ్ చరణ్ వైఫ్ నిద్రపోలేదట. ఈ విషయాన్ని స్వయంగా చరణే వెల్లడించాడు. ఇందంతా అనుష్క వల్లనే. అవును నిజం. రామ్ చరణ్ సతీసమేతంగా భాగమతి చిత్రం చూశాడట. అనుష్క అద్భుతంగా నటించిందని కితాబిచ్చాడు. టెక్నికల్ వాల్యూస్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ అన్ని సూపర్ అంటూ పొగిడేసాడు.

భాగమతి టీంకు శుభాకాంక్షలు తెలియజేసిన రామ్ చరణ్ ఆ తరువాత తన భార్య ఉపాసన గురించి చెప్పుకొచ్చాడు. భాగమతి చూసిన తరువాత న భార్య రాత్రంతా నిద్ర పోలేదు అంటూ చరణ్ తన పేస్ బుక్ పేజీలో పోస్ట్ పెట్టాడు. ఇటీవల విడుదలైన అనుష్క భాగమతి చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అనుష్క మరో మారు తన నటనతో మెప్పించింది.