బోయపాటి-రామ్ చరణ్ ఫస్ట్ లుక్ సిద్ధం..!?

Monday, September 24th, 2018, 07:29:22 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ ప్రేక్షకుల నాడి నరనరాల తెలిసిన మాస్ డైరెక్టర్ బోయపాటి శీను వీరిద్దరి కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి,అసలే బోయపాటి మంచి మాస్ సినిమాలు తియ్యడంలో దిట్ట అందులోను మంచి ఊపులోనూ ఉన్నాడు,అదే విధంగా రామ్ చరణ్ కూడా రంగస్థలం ఇచ్చిన హిట్ బూస్ట్ తో ఇంకా ఎనర్జెటిక్ గా ఉన్నాడు.ఇప్పుడు వీరి ప్రాజెక్ట్ కూడా కేజ్రీగా మారిపోయింది.

వీరిద్దరి సినిమా మొదలు పెట్టి ఇన్ని నెలలు కావస్తున్నా ఒక్క అప్డేట్ కూడా వదల్లేదు దీనితో అభిమానులు కాస్త నిరాశకి లోనవుతున్నారు,దీనితో ఈ సారి వీరి చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి,ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి,ఒకేవేళ ఇదే నిజం అయితే అభిమానులా ఆనందానికి హద్దులుండవు ఇప్పటికే రామ్ చరణ్ మాస్ హీరోగా ఇది వరకు మెప్పించాడు,బోయపాటి కోసం చెప్పనవసరం లేదు దీనితో ఇంకో ఫుల్ మాస్ రామ్ చరణ్ ని చూడబోతున్నాం.వేచి చూద్దాం ఈ చిత్రం ఇప్పుడేప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.