చరణ్ – రకుల్ కలిసి సెట్లో ఎం చేసేవారో తెలుసా?

Sunday, November 27th, 2016, 11:02:34 AM IST

dhruva-still
టైటిల్ చూడగానే .. ఇంకేదో అనుకోకండి … ? రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ”ధ్రువ” సినిమాకోసం కొత్త లుక్ ను మైంటైన్ చేసాడు. జిమ్ లో బాగా కష్టపడి తన బాడీని ఫిట్ నెస్ గా మార్చేశాడు. ఇక లేటెస్ట్ గా విడుదలైన ‘ధ్రువ’ ట్రైలర్ దుమ్ము రేపుతోంది. చరణ్ బాడీ ఫిట్నెస్ కు అందరు షాక్ అవుతున్నారు. ఇక రకుల్ ప్రీత్ కూడా ఖాళి సమయంలో జిమ్ లో గడపడం గురించి అందరికి తెలిసిందే. తనకు జిమ్ బిజినెస్ కూడా ఉంది .. అయితే వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు కలిసి కూర్చుంటే .. జిమ్, ఫిట్నెస్ కు సంబందించిన మాటలే మాట్లాడుకునేవారట !! వీరిద్దరి మాటలు విన్న యూనిట్ సభ్యులు షాక్ అయ్యేవారట ! అంతలా వీరు ఫిట్నెస్, కొత్త కొత్త వర్కవుట్స్ గురించి మాట్లాడుకునేవారని టాక్.