వీడియో : చిట్టిబాబుకు ఆకలేస్తోందట..ఉపాసనని చెర్రీ ఎలా అడిగాడంటే..!!

Wednesday, January 31st, 2018, 04:58:29 PM IST

మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటారు. తన భర్త మిస్టర్ సి గురించిన విశేషాలని తరచుగా అభిమానులతో పంచుకుంటుంటారు. చెర్రీ తనతో ఎంత అన్యోన్యంగా ఉంటాడో తెలిపే సరదా వీడియోని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. తనకు ఆకలేస్తున్న విషయాన్ని రామ్ చరణ్ ఉపాసనకు చల్ అందంగా తెలియజేసాడు.

‘ఉప్సి(ఉపాసన) గారండీ..చిట్టిబాబుకు ఆకలేస్తోందండి’ అంటూ రాంచరణ్ ఓ బొమ్మని అడ్డు పెట్టుకుని తెలిపాడు. ఏ వీడియో అభిమానులని తెగ ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం రంగస్థలం. ఈ చిత్రంలో చెర్రీ పాత్ర పేరు చిట్టి బాబు అనే సంగతి తెలిసిందే. నా ప్రియమైన మిస్టర్ సి లంచ్ పెట్టమని అడిగాడు అంటూ ఉపాసన కామెంట్ రాశారు. దీనికి రంగస్థలం అనే హ్యాష్ ట్యాగ్ ని సైతం ఉపాసన జత చేశారు. ఆకలేస్తోందంటూ సతీమణిని అడుగుతున్న రామ్ చరణ్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.