రామ్ చరణ్ సినిమాకు హిందీలో 22కోట్లా?

Wednesday, February 21st, 2018, 12:42:54 PM IST

టాలీవుడ్ హీరోల మార్కెట్ గత కొంత కాలంగా చాలా వరకు పెరుగుతూ వస్తోంది. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా భారీ సినిమాల్లో కనిపిస్తూ రిలీజ్ కు ముందే అంచనాలను రేపుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. మెగా పవర్ స్టార్ రామ్ సినిమా బాలీవుడ్ లో మంచి రేట్ కు అమ్ముడుపోయిందని టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది. మొదటి సారి ఏ తెలుగు హీరో అందుకొని విధంగా హిందీ శాటిలైట్ డిజిటల్ రైట్స్ కి భారీ అమౌంట్ దక్కింది.

బాలీవుడ్ కి చెందిన ఒక బడా నిర్మాణ సంస్థ రామ్ చరణ్ – బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కబోయే నెక్స్ట్ సినిమా శాటిలైట్ డిజిటల్ రైట్స్ ను రూ 22కోట్లకు కొనుకున్నారని తెలుస్తోంది. డివివి.దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రీసెంట్ గా ఆయనతో చర్చలు జరిపి డీల్ సెటిల్ చేశారని తెలుస్తోంది. బోయపాటి గత సినిమాలు నార్త్ ప్రేక్షకులకు బాగా నచ్చడం వల్లే ఈ స్థాయిలో ధర అందినట్లు సమాచారం. ఇక రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న రంగస్థలం సినిమా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. వచ్చే నెల మార్చ్ లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నారు.