మెగా స్టార్ నెక్స్ట్ టైటిల్ అదిరింది!

Monday, April 30th, 2018, 01:21:15 PM IST

రంగస్థలం సినిమాతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు కొత్త పాఠాలు నేర్పిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో సినిమాతో కూడా సరికొత్త విజయం అందుకోవాలని చూస్తున్నాడు. చరణ్ నెక్స్ట్ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాలో కొన్ని సన్నివేశాలను బోయపాటి ఫినిష్ చేశాడు. చరణ్ కు సంబందించిన సన్నివేశాలను ఇంకా స్టార్ట్ చేయాల్సి ఉంది. అయితే ఈప్రాజెక్టు కోసం ప్రస్తుతం కొన్ని టైటిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముందుగా రాజా వంశస్థుడు అనే టైటిల్ ను ఖరారు చేసిన చిత్ర యూనిట్ మెగా పవర్ స్టార్ రేంజ్ కి ఆ టైటిల్ సెట్ అవ్వలేదు అని టాక్ రావడంతో వెంటనే రాజా మార్తాండ అని సెట్ చేసారని తెలుస్తోంది. దీంతో అభిమానుల నుంచి టైటిల్ పై పాజిటివ్ కామెంట్స్ అందుతున్నాయి. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనున్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments