మొబైల్ బ్రాండ్ కు రామ్ చరణ్ ప్రచారం ?

Thursday, May 24th, 2018, 11:44:03 AM IST

పలువురు స్టార్స్ పలు కంపెనీ లకు సంబందించిన వాటికీ ప్రచారం కల్పిస్తూ ఆయ ఉత్పత్తులకు క్రేజ్ తీసుకువచ్చి .. సేల్స్ పెంచుతున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ లో మహేష్ బాబే నంబర్ వన్. ఆ తరువాత అల్లు అర్జున్, ఎన్టీఆర్ లు పలు బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మెగా హీరో రామ్ చరణ్ ఓ న్యూ మొబైల్ కోసం బ్రాండ్ బాబు గా అవతారం ఎత్తనున్నాడు. హ్యాపీ పేరుతొ ఓ న్యూ బ్రాండ్ మొబైల్ ను ఈ రోజా లాంచ్ చేయనున్నారు. ఈ మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తనదైన ప్రచారంతో ఆ కంపెనీ సేల్స్ పెంచాలనే ప్లాన్ లో ఉన్నారు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఏకంగా 206 కోట్లు వసూళ్లతో టాలీవుడ్ లో సంచలనం రేపింది. ప్రస్తుతం చరణ్, బోయపాటి శ్రీనుతో చేస్తున్న సినిమా ఇటీవలే బ్యాంకాక్ లో షూటింగ్ పూర్తీ చేసుకుని వచ్చింది. త్వరలోనే హైద్రాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ మొదలు కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments