చరణ్ రంగస్థలంపై .. స్వయంకృషి నీడలు ?

Thursday, September 28th, 2017, 12:51:16 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం 1985 గురించి కొత్త కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. అయితే సినిమా యూనిట్ నుండి మాత్రం ఎలాంటి వివరాలు, ఫోటోలు రావడం లేదు. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న అనసూయ ఈ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పడం ఆసక్తి కలిగిస్తుంది. రంగస్థలంలో ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసి షాకిచ్చింది. ఈ సినిమాలో తన పాత్ర బాగా నచ్చిందని చెప్పిన ఈ అమ్మడు .. రంగస్థలం చిత్రాన్ని .. అప్పట్లో మెగాస్టార్ నటించిన స్వయంకృషి తో పోలుస్తోంది !! ఇందులో చరణ్ గ్రామీణ యువకుడిగా కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర గురించి అనసూయ చెబుతూ .. గతంలో చిరంజీవి నటించిన స్వయంకృషి లోని పాత్రతో మెగాస్టార్ మెప్పించాడో .. ఇందులో చరణ్ కూడా అచ్చంగా పాత్రలో ఒదిగిపోయాడని, చరణ్ నటనకు స్పెల్ బౌండ్ అయ్యానని చెబుతుంది ? చరణ్ తో కలిసి చేస్తున్న మొదటి సినిమా ఇది, నిజంగా చరణ్ టాలెంట్ కు షాకయ్యా అని అనసూయ చెప్పింది ? ఈ మాటలు మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తెస్తున్నాయి. మరి మెగాస్టార్ నటించిన స్వయం కృషి అప్పట్లో ఓ పెద్ద సంచలనం .. మరి చరణ్ కూడా రంగస్థలం తో ఎలాంటి సంచలనం రేపుతాడో చూడాలి !!

  •  
  •  
  •  
  •  

Comments