సినిమా మొదలయ్యాక బోయపాటికి రామ్ చరణ్ షాక్..?

Saturday, December 9th, 2017, 01:20:31 AM IST

బోయపాటి తిరుగులేని మాస్ దర్శకుడు. తన చిత్రాల ద్వారా ఆ విషయాన్ని నిరూపించుకున్నారు. కానీ బోయపాటి కథలన్నీ ఒకే మూసలో ఉంటాయనే విమర్శ ఉంది. ఆ ప్రభావాన్ని దర్శకుడు సినిమా రిజల్ట్ పై పడకుండా ఇప్పటి వరకు జాగ్రత్త పడ్డాడు. కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఇటీవలే పూజా కార్యక్రమాలతో చిత్రం మొదలైంది. బోయపాటి దర్శకత్వంపై రామ్ చరణ్ కు ఎటువంటి అనుమానాలు లేవు.

కానీ కథ విషయంలో రామ్ చరణ్ బోయపాటికి షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా కథలో మార్పులు చేయాల్సిందే అని చెర్రీ బోయపాటిని ఇరకాటంలో పెట్టినట్లు తెలుస్తోంది. గతంలోనే ఓ కథతో బోయపాటి చరణ్ వద్దకు వెళ్లాడు. ఆ కథ నచ్చకపోవడంతో తరువాత చేద్దాంలే అని చరణ్ చెప్పేశాడట. అదే కథని బెల్లం కొండతో జయ జానకి నాయక గా బోయపాటి రూపొందించాడు. ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఈ సినిమా కూడా ఉంటె మొదటికే మోసం వస్తుందని చరణ్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే తప్పని సరిగా కథకి రిపేర్లు చేయమని చరణ్ ఆర్డర్ వేసినట్లు సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. బోయపాటి కథని ఎప్పుడు రెడీ చేస్తాడో.. సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందో కాలమే నిర్ణయించాలి.

  •  
  •  
  •  
  •  

Comments