కొత్త లుక్ కోసం చెర్రి చేష్టలు…

Tuesday, April 17th, 2018, 02:11:03 PM IST

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఈ ఏడాది రంగ‌స్థ‌లం చిత్రంతో భారీ విజయం సాధించాడు. ఈ సినిమా త‌న కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. చిట్టిబాబు పాత్ర‌లో భారీ గ‌డ్డంతో ప‌ల్లెటూరి వ్య‌క్తిగా కనిపించి మురిపించాడు. రామ్ చ‌ర‌ణ్ లుక్ ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. యూత్ అంతా అదే ఫాలో అవుతున్నారు. క‌ట్ చేస్తే చ‌ర‌ణ్ త‌న 12వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌నున్న రామ్ చ‌ర‌ణ్ కొత్త లుక్ కోసం చెమ‌టోడుస్తున్నాడు. ఈ విష‌యాన్ని చ‌ర‌ణ్ మిసెస్ ఉపాస‌న ఫోటో షేర్ చేస్తూ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. ‘ఖాళీ కడుపుతో కార్డియో చేశారు. ఇప్పుడు వేరే సెషన్‌ కోసం అపోలో లైఫ్‌ స్టూడియోకు వెళుతున్నాం. ఆర్‌సీ 12 కోసం చ‌ర‌ణ్ కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు అని ఉపాస‌న కామెంట్ చేసింది.

బోయ‌పాటి చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే మొద‌లు కాగా, ఏప్రిల్ 21న మొద‌లు కానున్న మ‌రో షెడ్యూల్‌లో టీంతో జాయిన్ కానున్నాడు రామ్ చ‌ర‌ణ్‌. వివేక్‌ ఒబెరాయ్, ప్ర‌శాంత్‌, స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రంగ‌స్థ‌లం చిత్రానికి మంచి మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్ర‌సాద్‌, చెర్రీ త‌దుపరి సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. డీవివి ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. ఈ మూవీకి రాజ‌వంశ‌స్థుడు అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం.

  •  
  •  
  •  
  •  

Comments