ఆయన ఒప్పుకుంటే తప్పకుండా చేస్తా ……

Friday, May 25th, 2018, 05:07:57 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్దహిట్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం తన మార్కెట్ ను పెంచుకోవడానికి బాలీవుడ్ వైపుగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ విషయమై ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలీవుడ్ దర్శకులలో తనకు రాజ్ కుమార్ హిరాని అంటే చాలా ఇష్టమని, ఆయన ఓకె అంటే ఆయనతో ఒక సినిమా చేయాలని ఉందని అన్నారు. కాగా ఇంతకు ముందు జంజీర్ సినిమా తో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన చెర్రీ ఆ సినిమాతో ప్రేక్షకులని పెద్దగా అలరించలేక పోయాడు. దాంతో మొదటి అడుగు లోనే నిరాశ తప్పలేదు రామ్ చరణ్ కి . ఇక ప్రస్తుతం ప్రభాస్ మరియు దుల్కర్ సల్మాన్ లు కూడా బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు…చూడాలి మరి రానున్న రోజుల్లో రామ్ చరణ్ బాలీవుడ్ వైపు వేసే అడుగులు ఎంతవరకు ఫలితాన్నిస్తాయో అనేది…

  •  
  •  
  •  
  •  

Comments