ఎండలో ఐస్‌క్రీమ్ – సోడాలమ్మిన రామ్ చరణ్

Thursday, April 26th, 2018, 07:31:05 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దయా హృదయంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ ను మించిపోతున్నాడు. ఎక్కువగా అభిమానులకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే మంచి లక్ష్మి – మేము సైతం ప్రోగ్రాం ద్వారా రామ్ చరణ్ కొందరికి సహాయం అందించడానికి ముందుకు వచ్చాడు. డబ్బును సేకరించేందుకు హైదరాబాద్ లోని సారధి స్టూడియో దగ్గర ఐస్‌క్రీములు, సోడాడు అమ్మాడు. అలాగే అభిమానులకు సెల్ఫీలు ఇచ్చి ఎంతో ఆనందానికి గురి చేశాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ చాలా కష్టపడ్డాడు. త్వరలో రామ్ చరణ్ కి సంబందించిన ఎపిసోడ్ ప్రసారం కానుంది. అందుకు సంబందించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి.

ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

  •  
  •  
  •  
  •  

Comments