చరణ్ ని పూర్తిగా మార్చేయనున్న సుకుమార్..!

Monday, January 30th, 2017, 10:21:58 PM IST

charan-movie
హీరో గా నటించిన ధృవ చిత్రం, ప్రొడ్యూసర్ గా మారి విడుదల చేసిన మెగాస్టార్ ఖైదీ నెం 150 చిత్రం రెండూ ఘనవిజయం సాధించడంతో రామ్ చరణ్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. అదే ఉత్సాహంతో చరణ్ నేడు సుకుమార్ డైరెక్షన్ లో రాబోవు చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ చరణ్ ప్రీ లుక్ ని కూడా విడుదల చేసారు.ఈ లుక్ ని చూశాక పల్లెటూరి నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతుందన్న విషయం దర్శకుడు చెప్పకనే చెబుతున్నాడు.

భుజాన కావిడి మోస్తూ, లుంగీ లో ఉన్న చరణ్ ప్రీ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో చరణ్ పూర్తి వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.చిరంజీవి ముఖ్య అతిథి గా విచ్చేసి చిత్రాన్ని ప్రారంభించారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో రానున్న ఈ చిత్రంలో చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది.త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతుంది.