చరణ్ నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ ?

Friday, September 7th, 2018, 03:21:19 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విదేశాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. బోయపాటి శ్రీను స్టైల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు పెంచేసాయి. ఈ సినిమా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని వినాయక చవితి సందర్బంగా విడుదల చేస్తారట. ఇక ఈ సినిమా తరువాత చరణ్ నెక్స్ట్ సినిమాకు ఓకే చెప్పేసాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందట. ప్రస్తుతం మహేష్ తో వంశీ తెరకెక్కిస్తున్న మహర్షి సినిమా ప్రస్తుతం అమెరికాలో షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఉగాది సందర్బంగా ఏప్రిల్ 5న విడుదల చేస్తారట. ఈ సినిమా పూర్తవ్వగానే చరణ్ సినిమా తెరకెక్కిస్తాడట. ఇటీవలే చరణ్ కు వంశీ కథ వినిపించాడని .. కథ నచ్చడంతో డెవలప్ చేయమని చెప్పాడట. సో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎవడు సూపర్ హిట్ అవ్వడంతో మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది.

  •  
  •  
  •  
  •  

Comments