మొత్తానికి గ్యాంగ్ లీడర్ ని సెట్ చేసినట్టున్నారు ?

Thursday, June 14th, 2018, 09:37:14 AM IST

మెగాస్టార్ కెరీర్ లో గ్యాంగ్ లీడర్ సినిమా ఓ బ్లాక్ బస్టర్. మెగా మాసిజానికి గ్యాంగ్ లీడర్ ఓ ఉదాహరణ కూడా. ఇక ఈ సినిమాను రామ్ చరణ్ తో సీక్వెల్ చేయాలనీ ప్రయత్నాలు జరిగాయి. తాజాగా ఇప్పుడు గ్యాంగ్ లీడర్ కు సీక్వెల్ ప్లాన్స్ జరిగిపోయినట్టే అన్న సంగతి తెలుస్తోంది. అదెలా అంటే .. మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు తాజాగా మేన మేనల్లుడుతో తేజ్ ఐ లవ్ యూ అనే సినిమా తీసాడు. ఈ సినిమా ఆడియో వేడుకకు ముఖ్య అథితిగా విచ్చేసిన చిరంజీవి మళ్ళీ కె ఎస్ రామారావు బ్యానర్ లో ఓ సినిమా చేయాలనీ ఉందని .. నేను చేయకున్నా చరణ్ చేస్తాడని చెప్పాడు. అయితే కె ఎస్ రామారావు కూడా గ్యాంగ్ లీడర్ సినిమాకు చరణ్ తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట. నిజానికి మెగాస్టార్ చెప్పినదాన్ని బట్టి చుస్తే .. ఇప్పటికే దీనికి సంబందించిన చర్చలు జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి తో సినిమా చేస్తున్న చరణ్ ఆ తరువాత ఎన్టీఆర్ తో కలిసి ఓ మల్టి స్టారర్ చేయడానికి రెడీ అయ్యాడు. రాజమౌళి దర్శకత్వంలో సినిమా తరువాత ఈ బ్యానర్ లో చేస్తాడని టాక్. చూద్దాం ఏమి జరుగుతుందో.

  •  
  •  
  •  
  •  

Comments