షాకిస్తున్న రామ్ చరణ్- బోయపాటి ఫస్ట్ లుక్ ?

Tuesday, April 17th, 2018, 12:40:04 PM IST


ఈ మధ్య తమ హీరోలకు సంబందించిన సినిమాలకు సంబందించిన టైటిల్స్ .. ఫస్ట్ లుక్స్ పై జనాల్లో క్యూరియాసిటీ రేపడానికి కొందరు అభిమానులు టైటిల్స్ తో కూడిన ఫస్ట్ లుక్స్ చేస్తూ ఆ సినిమా పై మరింత క్రేజ్ పెంచుతున్న విషయం తెలిసిందే. తాజాగా రంగస్థలం తో సంచలన విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్ పై తాజాగా ఓ న్యూస్ ప్రచారంలో ఉంది .. అదేమిటంటే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాకు రాజా వంశస్తుడు అనే టైటిల్ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా రాజవంశస్తుడు అనే టైటిల్ ఇంకా ఖరారు కాలేదు .. కానీ తాజాగా మెగా అభిమాని ఎవరో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని డిసైన్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. కావాలంటే ఆ ఫస్ట్ లుక్ పై మీరు ఓ లుక్ వేయండి.