చెర్రీ – తారక్ టైటిల్ అదేనట?

Friday, December 1st, 2017, 04:00:59 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో రాజమౌళి తీయబోతోన్న మల్టి స్టారర్ గురించి అనేక రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే రామ్ చరణ్ – ఎన్టీఆర్ తో ఫోటోలో జక్కన్న కనిపించడో అప్పటి నుంచి అభిమానులకు ఏది నిజమో ఏది అబద్దమో అనే విషయం తెలియకుండా రూమర్స్ వస్తున్నాయి. ఇకపోతే సినిమా బడ్జెట్ దాదాపు 170 నుంచి 180 కోట్ల వరకు ఉండవచ్చని నిన్న మొన్న టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

అంతే కాకుండా రామ్ చరణ్ – ఎన్టీఆర్ అన్నదమ్ముల్లా కనిపించబోతున్నారని అలాగే ఇద్దరు ప్రొఫెషనల్ బాక్సర్లు గా ఉంటారని రూమర్స్ వచ్చాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని జక్కన్న నుంచి మాత్రం కొంచెం కూడా క్లారిటీ లేదు. ఇక లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే.. టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో టాక్ బాగా వినిపిస్తోంది. ‘బాక్సర్’ అని టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో రాజమౌళి టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే యమదీర అనే టైటిల్ కూడా పెట్టాలని ఫ్యాన్స్ నుంచి రిక్వెస్ట్ లు వస్తున్నాయట. అయితే రాజమౌళి మాత్రం పూర్తిగా స్క్రిప్ట్ రెడీ అయ్యేంత వరకు ఎలాంటి న్యూస్ చెప్పకూడదు అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments