తెలంగాణ‌లో రాంచ‌ర‌ణ్ ఫిలింస్టూడియో?

Saturday, February 11th, 2017, 10:25:44 PM IST


ఓవైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు వ్యాపారంలోనూ రాణిస్తున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. ఇప్ప‌టికే ఖైదీనంబ‌ర్ 150 సినిమాతో నిర్మాత‌గా మారాడు.
తొలి ప్ర‌య‌త్న‌మే గ్రాండ్ స‌క్సెస‌య్యాడు. ప్ర‌స్తుతం మెగాస్టార్ హీరోగా 151వ సినిమా నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. అలాగే డొమెస్టిక్ ఎయిర్‌వేస్ బిజినెస్‌లోనూ పెట్టుబ‌డులు పెట్టాడు. త‌క్కువ దూరాల‌కు వెళ్లే ట్రూజెట్ ఎయిర్‌వేస్‌ని విజ‌య‌వంతంగా ర‌న్ చేస్తున్నాడు. మ‌రోవైపు ప్రిన్ష్ మ‌హేష్‌బాబుతో క‌లిసి హోట‌ల్ బిజినెస్‌లోకి దిగాల‌న్న ప్లాన్ ఉంది.

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. చ‌ర‌ణ్ ఓ కొత్త ప్ర‌ణాళిక‌ను తెర‌పైకి తెచ్చార‌ని తెలుస్తోంది. తెలంగాణ‌లో అధునాత‌న సాంకేతిక‌త‌తో కూడిన ఓ ఫిలింస్టూడియోని ప్రారంభించాల‌ని చ‌ర‌ణ్ భావిస్తున్నాడు. అందుకు అవ‌స‌ర‌మైన స్థ‌లం, మౌలిక వ‌సతుల గురించి ఆరా తీస్తున్నాడ‌ని తెలుస్తోంది. తెలంగాణ ఐటీమంత్రి కేటీఆర్‌, ఇత‌ర‌త్రా నేత‌ల‌తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా చ‌ర‌ణ్‌కి ఇది వ‌ర్క‌వుట‌వుతుంద‌ని చెప్పుకుంటున్నారు. ఎలానూ నిర్మాత‌గా వ‌రుస‌గా సినిమాలు తీస్తున్నాడు కాబ‌ట్టి వాటి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌తో పాటు, ఇత‌ర‌త్రా ప‌నులు పూర్తి చేయొచ్చు. అలాగే వేరే హీరోల సినిమాల పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ చేయొచ్చు. సినిమాల‌తో పాటు టీవీ ప్రొడ‌క్ష‌న్ సంబంధించిన ప‌నుల‌కు ఇది అందుబాటులో ఉంటుంది. హైద‌రాబాద్‌లో ఇండ‌స్ట్రీ అభివృద్ధికి తెలంగాణ ప్ర‌భుత్వం సానుకూలంగా ఉంది కాబ‌ట్టి అది కలిసొచ్చే అంశంగా చ‌ర‌ణ్ భావిస్తున్నారుట‌.