గరిట తిప్పిన చెర్రి..ఇంతకీ రీల్ లోనా రియల్ గానా ..?

Wednesday, April 18th, 2018, 04:57:59 PM IST

ఒక‌వైపు రంగ‌స్థ‌లం చిత్ర విజ‌యాన్ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూనే మ‌రోవైపు బోయ‌పాటి సినిమా కోసం రెడీ అవుతున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ . ఏప్రిల్ 21 నుండి జ‌ర‌గ‌నున్న నెక్ట్స్ షెడ్యూల్‌లో చ‌ర‌ణ్ .. బోయ‌పాటి టీంతో క‌ల‌వ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే చ‌ర‌ణ్‌కి సంబంధించిన విష‌యాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కి తెలియ‌జెప్పే ఉపాస‌న తాజాగా త‌న ట్వీట్‌లో మిస్ట‌ర్ సీ బ్రేక్ ఫాస్ట్ సిద్ధం చేసే విష‌యాన్ని ఫోటోల ద్వారా తెలిపింది. ‘మాస్టర్‌ చెఫ్‌, ‘మిస్టర్‌ సి’ వర్క్‌ అవుట్స్‌ తరువాత మా ఇద్దరి కోసం బ్రేక్‌ఫాస్ట్‌ను సిద్ధం చేస్తున్నారు’ అనే కామెంట్‌ తో పాటు చరణ్‌ వంట చేస్తున్న రెండు ఫొటోలను షేర్ చేశారు ఉపాస‌న‌. ఈ ఫోటోల‌పై నెటిజ‌న్స్ వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు. గ‌తంలో చిరు కూడా గ‌రిటె ప‌ట్టిన ఫోటోని ప‌క్క‌న పెట్టి కంపేర్ చేస్తున్నారు.

రంగ‌స్థ‌లంలో భారీ కాయంతో మాస్ లుక్‌లో కనిపించిన చ‌ర‌ణ్‌, త‌న 12వ సినిమాలో డిఫ‌రెంట్ లుక్‌తో క‌నిపించ‌నున్నాడు. న్యూ లుక్ కోసం చెర్రీ భారీ వ‌ర్క‌వుట్సే చేస్తున్నాడు. రీసెంట్‌గా ఉపాస‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా చెర్రీ చెమ‌టోడుస్తున్నాడ‌నే విష‌యం చెప్పిన‌ సంగతి తెలిసిందే. ‘ఖాళీ కడుపుతో కార్డియో చేశారు. ఇప్పుడు వేరే సెషన్‌ కోసం అపోలో లైఫ్‌ స్టూడియోకు వెళుతున్నాం. ఆర్‌సీ 12 కోసం చ‌ర‌ణ్ కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు అని ఉప్సీ త‌న ట్వీట్‌లో తెలిపింది. చ‌ర‌ణ్ 12వ చిత్రంలో వివేక్‌ ఒబెరాయ్, ప్ర‌శాంత్‌, స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు . రంగ‌స్థ‌లం చిత్రానికి మంచి మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్ర‌సాద్‌, చెర్రీ త‌దుపరి సినిమాకి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. డీవివి ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంద‌ని తెలుస్తుంది. ఈ మూవీకి రాజ‌వంశ‌స్థుడు అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం .

  •  
  •  
  •  
  •  

Comments