షాక్ … రంగస్థలం కోసం రెండు క్లైమాక్స్ లా ?

Wednesday, September 27th, 2017, 11:36:27 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ”రంగస్థలం 1985” షూటింగ్ జోరుగా జరుపుకుంటుంది. హైదరాబాద్ లో వేసిన భారీ విలేజ్ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ గ్రామీణ యువకుడిగా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా గురించి మెగా ఫాన్స్ లో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. మరో వైపు సినిమా విషయంలో అయోమయం కూడా నెలకొన్నట్టు తెలుస్తోంది ? ఇందులో అయోమయం ఏముందని అంటారా .. గోదావరి జిల్లాలో షూటింగ్ జరిగినన్నాళ్లు సినిమా గురించి పక్క సమాచారం వచ్చింది .. కానీ దాన్ని హైదరాబాద్ కు షిఫ్ట్ చేసినతరువాతే అసలు అమీ జరుగుతుందో అర్థం కాకుండా ఉంది పరిస్థితి. ఇక సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ కానీ .. కనీసం షూటింగ్ ఫొటోస్ కానీ రావడం లేదని ఫాన్స్ టెన్షన్ పడుతున్నారు. అంతే కాదు .. ఈ సినిమాకోసం సుకుమార్ రెండు క్లైమాక్స్ లు ప్లాన్ చేస్తున్నాడట ? సినిమా మొదట్లోనే మెగాస్టార్ కు ఈ విషయం చెప్పాడట సుకుమార్ ? అందుకే ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడని, దాంతో పాటు సినిమాకు సంబందించిన ఎలాంటి లీకేజీలు లేకుండా జాగ్రత పడుతున్నారట ? మరి రంగస్థలం కోసం రెండు క్లైమాక్స్ లు అవసరమా ? అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం సుకుమార్ ఆలోచన ఏమిటో ? పీరియాడిక్ సినిమా కావడంతో ఎక్కువ రిస్క్ అవసరమా అన్న ఆలోచనలో ఉన్న సుకుమార్ మాత్రం .. ఈ సినిమా చరణ్ కెరీర్ లో బెస్ట్ అవుతుందని చెబుతున్నాడట ?

  •  
  •  
  •  
  •  

Comments