బాలీవుడ్ లోకి రామ్ చరణ్ ?

Saturday, May 12th, 2018, 12:06:17 PM IST

అదేంటి ఇప్పటికే రామ్ చరణ్ హిందీలోకి ఎంట్రీ ఇచ్చి జంజీర్ అనే సినిమా చేసాడుగా మళ్ళీ ఎంట్రీ ఏమిటా ? అని షాక్ అవుతున్నారా… మీరు అన్నది నిజమే
జంజీర్ తో హీరోగా హిందీలోకి ఎంట్రీ ఇచ్సినా రామ్ చరణ్ కు భారీ నిరాశే దక్కింది. అమితాబ్ నటించిన జంజీర్ సినిమాకు రీమేక్ గా చేసిన ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో చరణ్ మళ్ళీ బాలీవుడ్ ప్రయత్నాలు చేయలేదు .. పైగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఆ సినిమా చేసాడు. ఇప్పుడు చరణ్ అంటే టాలీవుడ్ లో ఓ క్రేజ్ . ఓ ఇమేజ్ ఉంది. అందుకే మళ్ళీ బాలీవుడ్ లో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. తాజగా రంగస్థలం సినిమాతో 200 కోట్లకు పైగా వసూళ్లు అందుకుని తన సత్తా చాటుకున్న చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను తో ఓ మాస్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి మల్టి స్టారర్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చరణ్ మాట్లాడుతూ తెలుగులోనే కాదు తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేయాలనీ ఉంది. మంచి కథలకు ఎదురు చూస్తున్నా అని చెప్పాడు. సో మంచి కథ కుదిరిందంటే చరణ్ బాలీవుడ్ సినిమా పట్టాలు ఎక్కే అవకాశాలు ఉన్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments