చిట్టిబాబుగా మళ్ళీ పుట్టానంటున్న చరణ్ ?

Sunday, April 1st, 2018, 11:29:44 AM IST

మెగా అభిమానులు ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. రంగస్థలం సినిమాతో ఓ సంచలన విజయం దక్కింది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు అభినందనలు పడుతున్నాయి. రామ్ చరణ్ నటుడిగా ఓ మెట్టు ఎక్కడని అంటున్నారు. ఈ విషయం గురించి చరణ్ స్పందిస్తూ ..చిట్టిబాబు గా మళ్ళీ పుట్టినట్టనిపించిందని అన్నారు. సుకుమార్ పెట్టుకున్న నమ్మకమే ఈ సినిమా విజయానికి కారణం అని, ప్రతి విషయంలో యూనిట్ తీసుకున్న జాగ్రత్తలే .. ఇలాంటి గొప్ప సినిమాలు రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. సినిమా చూసాక నాన్న గట్టిగా కొగిలించుకుని అద్భుతంగా చేసావని చెప్పడం గొప్పగా ఉందని చెప్పాడు చరణ్. 1980 నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన ప్రతి ఏరియాలో భారీ ఓపెనింగ్స్ తో ఓ రేంజ్ సంచలనం రేపింది.