బోయపాటి కోసం కండలు పెంచుతున్న మెగా హీరో ?

Tuesday, October 31st, 2017, 08:20:05 PM IST

ఏ హీరోకైనా మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలన్న కోరిక బలంగా ఉంటుంది. ఎన్ని సూపర్ హిట్స్ .. క్లాసిక్ సినిమాలు చేసినా సరే మాస్ ఇమేజ్ మాత్రమే కోరుకుంటారు .. ఎందుకంటే అదే ఆ హీరోకి నిజమైన భలం. అయితే దర్శకులందరు మాస్ సినిమాలు తీయలేరు .. అందులో కొందరు మాత్రం స్పెషలిష్ లు ఉంటారు. ఈ విషయం అంత ఎవరి గురించో అని షాక్ అవుతున్నారా .. అక్కడికే వస్తున్నాం .. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985లో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా షూటింగ్ హైద్రాబాద్ లో జరుగుతుంది. ఇక ఈ సినిమా తరువాత చరణ్ నెక్స్ట్ సినిమా బోయపాటి శ్రీను తో కమిట్ అయ్యాడు. సరైనోడు సినిమాతో సంచలన విజయం అందుకున్న బోయపాటికి జయ జానకి నాయక ప్లాప్ ని అందించింది .. అందుకే ఈ సారి కసితో మంచి కమర్షియల్ విజయాన్ని ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి .. అందుకే నెక్స్ట్ సినిమా చరణ్ కోసం కథ సిద్ధం చేసాడు, మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కే ఈ సినిమాలో చరణ్ న్యూ లుక్ లో కనిపిస్తాడని, దానికోసం అయన కండలు పెంచే పనిలో పడ్డాడట !! మరి మాస్ , యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ అయినా బోయపాటి చరణ్ ను ఎలా చూపిస్తాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments